Home సినిమా వార్తలు Jr Ntr Busy with Lineups వరుస లైనప్స్ తో ఎన్టీఆర్ బిజీ బిజీ

Jr Ntr Busy with Lineups వరుస లైనప్స్ తో ఎన్టీఆర్ బిజీ బిజీ

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రస్తుతం మొత్తంగా నాలుగు సినిమాలు లైన్లో ఉన్నాయి. వాటిలో ముందుగా కొరటాల శివ తీస్తున్న దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకి రానుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా చేస్తున్నారు.

మరోవైపు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ కూడా ఆయన చేస్తున్నారు. ఈ మూవీ పై కూడా అందరిలో ఎన్నో అంచనాలు ఉన్నాయి. అలానే తాజాగా కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరోగా ఎన్టీఆర్ హీరోగా తీయనున్న మూవీ నేడు అధికారికంగా లాంచ్ అయింది.

ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించనున్నారు. విషయం ఏమిటంటే, ఈ సినిమాల్లో దేవర ముందుగా ఈ ఏడాది సెప్టెంబర్ 27న అలానే ఆ తరువాత వార్ 2 మూవీ వచ్చే ఏడాది ఆగష్టు 14న, అనంతరం ఎన్టీఆర్ నీల్ మూవీ 2026 జనవరి 9న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్నాయి. చివరిగా ఆపైన దేవర పార్ట్ 2 కూడా విడుదల కానున్నాయి. ఇక ఈ సినిమాలతో వరుసగా బిజీ బిజీగా గడుపునున్నారు యంగ్ టైగర్. మరి ఈ సినిమాలు ఆయనకు ఏ స్థాయి విజయాలను అందిస్తాయో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version