సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ పాన్ వరల్డ్ గ్లొబ్ ట్రాటింగ్ మూవీ SSMB29. ఈ మూవీ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ అందరిలో భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్నాయి.
ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈమూవీని శ్రీ దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. విషయం ఏమిటంటే, నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా SSMB29 మూవీ నుండి ఆయన యొక్క ప్రీ లుక్ ని రిలీజ్ చేసింది టీమ్.
ఆ లుక్ లో టీ షర్ట్ వేసుకున్న మహేష్ బాబు మేడలో శివుడు, నంది, త్రిశూలంతో కూడిన గొలుసుని మేడలో ధరించి ఉండడం గమనించవచ్చు. దీనిని బట్టి ఈ మూవీ మన భారతీయ పురాణాలు, ఇతిహాసాల నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఇక ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ ని సాధారణ ప్రెస్ మీట్, ఫొటోస్ రిలీజ్ చేయడం కాకుండా ఈ ఏడాది నవంబర్ లో గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఒక పోస్ట్ ద్వారా తెలిపారు. మొత్తంగా నేడు రిలీజ్ అయిన ఈ మూవీ యొక్క ప్రీ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాని షాక్ చేస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ 2027 చివర్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.