Home సినిమా వార్తలు ‘బిచ్చగాడు -3’ అఫీషయల్ అనౌన్స్ మెంట్ 

‘బిచ్చగాడు -3’ అఫీషయల్ అనౌన్స్ మెంట్ 

bichagadu 3

నటుడు సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన సినిమా బిచ్చగాడు. ఈ మూవీ 2016 లో రిలీజ్ అయి అతిపెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో ఎంతో చిన్న సినిమాగా ఏ మాత్రం హైట్ లేకుండా రిలీజ్ అయిన బిచ్చగాడు అప్పట్లో నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలో కాసులు కురిపించింది.

ఈ సినిమాతో అటు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించిన విజయ్ ఆంటోని ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగారు. ఇక ఇటీవల దానికి సీక్వెల్ అయిన బిచ్చగాడు 2 రిలీజ్ అయి ఆశించిన స్థాయిలో విజయం మాత్రం అందుకోలేకపోయింది.

ఇక తాజాగా తన సినిమా మార్గన్ రిలీజ్ ఈవెంట్లో సందర్భంగా నటుడు విజయ్ ఆంటోని మాట్లాడుతూ తాము ప్రస్తుతం బిచ్చగాడు 3 మూవీ యొక్క ప్లానింగ్ లో ఉన్నామని అయితే అందులో కూడా తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తానని అన్నారు.

ఇక అతి త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమా 2027 సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది అని తెలిపారు. దానితో ఈ మూవీ పై అందరిలో ఒక్కసారి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఇది ఎంతవరకు అలరిస్తుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version