Home సినిమా వార్తలు శ్రీమంతుడు – గుడ్ బ్యాడ్ అగ్లీ : మైత్రి మూవీ మేకర్స్ సక్సెస్ఫుల్ కెరీర్

శ్రీమంతుడు – గుడ్ బ్యాడ్ అగ్లీ : మైత్రి మూవీ మేకర్స్ సక్సెస్ఫుల్ కెరీర్

mythri movie makers

తెలుగు సినిమా పరిశ్రమలోని తాజాగా భారీ స్థాయి సినిమాల నిర్మాణంతో కొనసాగుతున్న అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఒకటి. తొలిసారిగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా శ్రీమంతుడు సినిమాతో వీరి యొక్క సినీ నిర్మాణ ప్రయాణం ప్రారంభమైంది.

అయితే తొలి సినిమాతోనే అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ నిర్మాణ సంస్థ ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, రామ్ చరణ్ తో రంగస్థలం, అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలు, ఇక చిరంజీవితో వాల్తేరు వీరయ్య, బాలకృష్ణతో వీరసింహారెడ్డి, తాజాగా అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ తోపాటు అటు హిందీలో సన్ని డియోల్ తో జాట్ సినిమాలని నిర్మించారు.

అయితే కెరీర్ పరంగా చాలావరకు సక్సెస్ రేట్ కలిగి తమ సినిమాలను భారీగా హై క్వాలిటీ తో హైటెక్నికల్ వాల్యూస్ తో నిర్మించే మైత్రి మూవీ నిర్మాణ సంస్థల నిర్మాతలైన వై రవి శంకర్ మరియు నవీన్ ఎర్నేని తదుపరి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పై మరింతగా శ్రద్ధ పెట్టారు. ఇక వీరు నిర్మాణ సంస్థ నుంచి త్వరలో రాంచరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న పెద్ది తోపాటు ఎన్టీఆర్ నీల్ ల డ్రాగన్ అలానే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర ఉస్తాద్ భగత్ సింగ్, ప్రభాస్ హను రాఘవపూడి సినిమాలు ఉన్నాయి.

ఇక మరోవైపు పుష్ప 3 కూడా త్వరలో పట్టాలెక్కనుంది. వీటితోపాటు అటు హిందీ అలానే తమిళంలో కూడా వీరు మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ విధంగా తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ విజయాలతో మంచి పేరుతో కొనసాగుతోంది. మరి వీరి నుంచి రాబోయే సినిమాలు ఇంకెంతమేర విజయవందుకొని వీరికి ఏ స్థాయి పేరు తీసుకొస్తాయో చూడాలి

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version