కేజీఎఫ్ నిర్మాతలు మరియు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న శింబు

    Simbu Signs A Film With KGF Makers And National Award Winning Director

    గత కొన్ని సంవత్సరాలుగా, తమిళ స్టార్ హీరో శింబు బాక్సాఫీస్ వద్ద గ్యారంటీ గా హిట్లు ఇవ్వగల హీరోగా స్థిరపడ్డారు. శింబు ఎప్పుడూ బలమైన అభిమాన గణాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆయన నటించిన సినిమాలలో ఉన్న పేలవమైన కంటెంట్ కారణంగా బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో ఆయన కెరీర్‌లో కాస్త వెనుకబడి డల్‌ ఫేజ్‌ ఎదుర్కున్న మాట వాస్తవమే.

    అయితే ఇటీవల శింబు కంటెంట్ పరంగా మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్నారు. ఆయన నటించిన చివరి రెండు సినిమాలైన మానాడు, వెందు తానింధాతు కాడు చిత్రాలు అటు విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను కూడా రాబట్టాయి.

    మానాడు చిత్రానికి ముందు దర్శకుడు వెంకట్ ప్రభు కూడా సరైన విజయం లేక అందరి చేతా ఇంక కెరీర్ ముగిసిపోయింది అని అనిపించుకునే పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా మానాడు చిత్రం అధ్భుతమైన టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకుని ఘన విజయం సాధించింది. ఇక గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెందు తానింధాతు కాడు సినిమా కూడా చక్కని విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

    ఇక తాజాగా సూరరై పొట్రు సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకురాలు సుధా కొంగర తన తదుపరి సినిమా కోసం శింబుతో చర్చలు జరుపుతున్నట్లు బలమైన పుకార్లు వస్తున్నాయి. అలాగే ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేసినట్లు కూడా సమాచారం అందుతోంది సుధా కొంగర తన సినిమాల్లో చాలా కష్టతరమైన అంశాలకు భావోద్వేగాలను జొప్పించి తెరకెక్కిస్తారనే పేరు తెచ్చుకున్నారు. శింబుతో చేయబోయే చిత్రం కూడా అదే తరహాలో ఉంటుందని అంటున్నారు.

    ఇదొక్కటే కాక ఈ సినిమా గురించి మరి కొన్ని ఆసక్తికరమైన వార్తలు కూడా ఉన్నాయి. కేజీఎఫ్ వంటి ప్యాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సీరీస్.. మరియు తాజాగా దేశ వ్యాప్తంగా మారు మోగుతున్న బ్లాక్ బస్టర్ కాంతార వంటి సినిమాలను అందించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని బహుభాషా ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్నారు.

    కాగా ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో మిగిలిన నటీనటులు అలాగే ఇతర సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా వెల్లడి చేయబడతాయి.

    Follow on Google News Follow on Whatsapp




    Show comments
    Exit mobile version