Home సినిమా వార్తలు నిర్మాతలకు భారీ లాభదాయకమైన సినిమాగా నిలిచిన గాడ్‌ఫాదర్

నిర్మాతలకు భారీ లాభదాయకమైన సినిమాగా నిలిచిన గాడ్‌ఫాదర్

Godfather Is A Huge Profitable Venture For Makers

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఆయన స్థాయికి చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కింది. అందులోనూ చిరంజీవి రెమ్యునరేషన్ తీసేస్తే కేవలం 45 కోట్ల తక్కువ బడ్జెట్‌తో సినిమా తీశారు.

ఈ చిత్రం అక్టోబర్ 5న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు యావరేజ్ కలెక్షన్లను తెచ్చుకుంది. నిజానికి సినిమాకి పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ, ఎందుకనో ఈ సినిమా ప్రేక్షకులను సినిమా హాళ్ల వద్దకు లాగలేకపోయింది. ఈ చిత్రం ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 55 కోట్ల షేర్ వసూలు చేయగా, థియేట్రికల్ బిజినెస్ 80 కోట్లకు జరిగింది.

అయితే ఇక్కడ అంతా నష్టాల పాలయ్యారు అనుకునే విధంగా ఏమీ జరగలేదు. నిజానికి ఈ చిత్ర నిర్మాతలు మంచి లాభాలను వెనకేసుకున్నారు అని చెప్పచ్చు. ఈ సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌ అద్భుతంగా చేసింది. ఇక ప్యాన్-ఇండియన్ రిలీజ్ ఫ్యాక్టర్ కు తోడుగా హిందీ వెర్షన్‌లో సల్మాన్ ఖాన్ ఉండటం వల్ల, సినిమాకి సంభందించిన నాన్-థియేట్రికల్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

థియేట్రికల్‌తో పాటు నాన్‌ థియేట్రికల్‌ హక్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటే గాడ్‌ఫాదర్‌ నిర్మాతలు 150 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశారు. థియేటర్లలో సరైన విధంగా కలెక్షన్లు నమోదు చేయలేకపోయిన చిత్రానికి ఇవి చాలా భారీ లాభాలు అనే చెప్పాలి. ఇక ఈ లాభాలను చిరంజీవి, ఎన్వీ ప్రసాద్ పంచుకుంటారు. మొత్తం మీద, గాడ్ ఫాదర్ చిత్రం నిర్మాతలకు లాభదాయకమైన సినిమాగా నిరూపించబడింది.

గాడ్ ఫాదర్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మరియు నయనతార, సత్యదేవ్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, సముద్రఖనితో పాటు ఇతర తారలు కూడా నటించారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version