యువ నటుడు అఖిల్ అక్కినేని హీరోగా 2023 ఏప్రిల్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన మూవీ ఏజెంట్. ఈ స్పై యాక్షన్ మూవీలో యువ నటి సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటించారు.
బాలీవుడ్ నటుడు డినో మోరియా విలన్ గా నటించిన ఈ మూవీని స్టైలిష్ యాక్షన్ సినిమాల దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించగా ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ సంస్థల పై ఈ మూవీ గ్రాండ్ గా రూపొందింది. ఈ మూవీకి హిప్ హాఫ్ తమిళ సంగీతం సమకూర్చారు.
అయితే ఎన్నో అంచనాల మధ్య అప్పట్లో రిలీజ్ అయిన ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాదాపుగా రూ. 100 కోట్ల వ్యయంతో రూపొందిన ఈమూవీ ఓవరాల్ గా కలెక్షన్ పరంగా సింగిల్ డిజిట్ కి పరిమితం అవ్వడం దారుణం. అక్కడి నుండి కొన్ని ఫైనాన్షియల్ సమస్యల్లో ఇరుకున పడ్డ ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్, ఫైనల్ గా సెటిల్ అయి రెండు రోజుల క్రితం పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చింది.
అయితే ఓటిటిలో సైతం ఏజెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అఖిల్ యాక్టింగ్ బాగున్నప్పటికీ ఎంతో పేలవమైన కథ కథనాలు, సురేందర్ రెడ్డి టేకింగ్ పై భారీ స్థాయిలో ఆడియన్స్ నుడి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరకంగా దీని కంటే అఖిల్ ఫస్ట్ మూవీనే బెటర్ అని కొందరు అంటున్నారు.