తమిళ యువ నటుడు దర్శకుడు అయిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా అనుపమ పరమేశ్వరన్, కయదు లోహర్ హీరోయిన్స్ గా యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తరకెక్కిన తాజా సినిమా డ్రాగన్. ఈ మూవీ తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ టైటిల్ తో రిలీజ్ అయింది.
మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతోంది. తెలుగులో కొద దీనికి బాగా కలెక్షన్ లభిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రూ. 120 కోట్లను సొంతం చేసుకుని త్వరలో రూ. 150 కోట్లు దిశగా కొనసాగుతుంది.
ప్రదీప్ రంగనాథన్ అలరించే పెర్ఫార్మన్స్ తో పాటు ఆకట్టుకునే కథ కథనాలు, ఎలివేషన్స్, కామెడీ ఎంటర్టైనింగ్, ఎమోషనల్ సీన్స్ ఈ సినిమా సక్సెస్ కి ప్రధాన కారణాలు. ఇక ఈ సినిమా యొక్క ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్ తాజాగా వెల్లడయ్యాయి.
అందుతున్న సమాచారం ప్రకారం డ్రాగన్ మూవీ మార్చి 28 నుండి తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువతతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మెప్పిస్తున్న డ్రాగన్ మూవీ ఓటిటి రిలీజ్ అనంతరం ఏ స్థాయి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి. కాగా ఈ మూవీని ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది.