యువ నటుడు నితిన్ హీరోగా యువ అందాల నటి శ్రీలీల హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. ఇందులో నితిన్ ఒక డిఫరెంట్ పాత్రలో నటిస్తుండగా ఆ పాత్ర ఆద్యంతం ఆడియన్స్ ని అలరిస్తుందని మేకర్స్ అంటున్నారు.
గతంలో వెంకీ దర్శకత్వంలో నితిన్ చేసిన భీష్మ మూవీ పెద్ద విజయం అందుకుంది. దానితో అందరిలో రాబిన్ హుడ్ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, గ్లింప్స్ అన్ని కూడా బాగానే రెస్సాన్స్ సొంతం చేసుకున్నాయి. ఇక ప్రమోషన్స్ పరంగా కూడా టీమ్ మరింత ఫాస్ట్ గా ఉంది. విషయం ఏమిటంటే, ఈ మూవీ ద్వారా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇండియన్ సినిమా పరిశ్రమలోకి నటుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.
ఈ విషయాన్ని ఇటీవల రాబిన్ హుడ్ ఈవెంట్ లో భాగంగా దర్శకడు తెలిపారు. కాగా నేడు వార్నర్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. కాగా ఆయన ఇందులో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నట్లు టాక్. మార్చి 28న రాబిన్ హుడ్ మూవీ గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.