యువ నటుడు విశ్వక్సేన్ హీరోగా యువ దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లైలా. ఈ సినిమా ద్వారా తొలిసారిగా లేడీ గెటప్ లో కనిపించి చాలెంజింగ్ పాత్రలో ఆకట్టుకున్నారు విశ్వక్.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ మూవీని సాహు గారపాటి నిర్మించగా లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు. అయితే అటు ప్రమోషన్స్ పరంగా అలానే టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పర్చిన లైలా మూవీ ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి ఫస్ట్ రోజు ఫస్ట్ షో నుంచి పూర్తి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుని ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ఈ సినిమా ఓవరాల్ గా రూ. 1.5 కోట్ల షేర్ మాత్రమే అందుకొని భారీ నష్టాల్ని అటు నిర్మాతలకు ఇటు డిస్ట్రిబ్యూటర్లకి మిగిల్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని ఇబ్బందికర సన్నివేశాలతో పాటు ఏమాత్రం ఆకట్టుకోని కామెడీ, కథ, కథ కథనాలపై ఆడియన్స్ నుంచి తీవ్రంగా అయితే విమర్శలు వచ్చాయి. ఇకపై తన సినిమాల్లో ఇబ్బందికర కంటెంట్ తో కూడిన సన్నివేశాలు లేకుండా చూసుకుంటానని ఇటీవల విశ్వక్సేన్ ఒక ప్రకటన ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.
అయితే విషయం ఏమిటంటే లైలా సినిమా మార్చి 7న ప్రముఖ ఓటిటి మాధ్యమం అమేజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్స్ ముందుకు రానుంది. మరి తొలిసారిగా విశ్వక్సేన్ లేడీ గెటప్ లో కనిపించిన లైలా మూవీ అటు థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఎంత మేర ఓటిటి ఆడియన్స్ ఆకట్టుకుంటుందో చూడాలి