Home సినిమా వార్తలు అంచనాలు పెంచేసిన ‘రెట్రో’ ట్రైలర్

అంచనాలు పెంచేసిన ‘రెట్రో’ ట్రైలర్

retro

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా ఇటీవల సిరుతై శివ తెరకెక్కించిన సినిమా కంగువ. అయితే ఎంతో భారీ వ్యయంతో ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది. దాని అనంతరం తాజాగా యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుతో కలిసి సూర్య చేసిన సినిమా రెట్రో. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జోజు జార్జ్, జయరాం, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి వారు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఒకప్పటి కాలంనాటి పరిస్థితుల నడుమ రూపొందిన ఈ మూవీ యొక్క ట్రైలర్ బాగానే ఉంది. ఇక ఇప్పటికే ఈ ట్రైలర్ 24 గంటల్లో 10 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ట్రైలర్ లో సూర్య మార్క్ యాక్షన్ తో పాటు లవ్ సన్నివేశాలు ఫైట్ సీన్స్, డైలాగ్స్ వంటివి అందరిని ఆకట్టుకుంటున్నాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సంతోష్ నారాయణ బాగానే అందించారు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరిని బాగానే ఆకట్టుకుంది. మొత్తంగా రెట్రో ట్రైలర్ ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచిందని చెప్పాలి. మే 1న ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో భారీ స్థాయిలో పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. మరి రెట్రో తో సూర్య ఎంత మేర విజయం అనుకుంటారో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version