Home సినిమా వార్తలు Pushpa 2: First Industry Hit For Allu Arjun? ‘పుష్ప – 2’ అల్లు...

Pushpa 2: First Industry Hit For Allu Arjun? ‘పుష్ప – 2’ అల్లు అర్జున్ కి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ కానుందా ?

pushpa 2 movie

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన లేటెస్ట్ సినిమా పుష్ప 2. ఈ ఈ మూవీపై అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, రావు రమేష్, సునీల్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్ లో దాదాపుగా 12 వేలకు పైగా థియేటర్లో పుష్ప 2 మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ మూవీపై అందరిలో కూడా భారీ స్థానాలు ఉన్నాయి.

అయితే మ్యాటర్ ఏంటంటే ఇప్పటివరకు టాలీవుడ్ స్టార్ హీరోల్లో అందరికీ కూడా భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. మహేష్ కి పోకిరి, పవన్ కు అత్తారింటికి దారేది, చరణ్ కు మగధీర, అలానే ప్రభాస్ కు బాహుబలి, ఇక ఎన్టీఆర్ ఇటీవల చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

కాగా త్రివిక్రమ్ తో చేసిన అలవైకుంఠపురంలో సినిమాతో అల్లు అర్జున్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నప్పటికీ అది ఒకరకంగా నాన్ బాహుబలి హిట్ తప్ప ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అని చెప్పాలి. ఇక ప్రస్తుతం పుష్ప 2 మూవీ భారీ స్థాయిలో అందరి నుంచి క్రేజ్ అందుకోవడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో తన సత్తా నిరూపించుకుని సోలోగా ఇండస్ట్రీట్ అందుకుంటారో లేదో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version