Home సినిమా వార్తలు Shocking Response for Pushpa 2 Special Shows పుష్ప 2 స్పెషల్ షోస్ కి...

Shocking Response for Pushpa 2 Special Shows పుష్ప 2 స్పెషల్ షోస్ కి షాకింగ్ రెస్పాన్స్

pushpa

పాన్ ఇండియన్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప 2 పై అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రవిశంకర్, నవీన్ ఎర్నేని గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మించిన ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించారు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలన్నీ కూడా అందర్నీ ఆకట్టుకొని దేశవ్యాప్తంగా అన్ని భాషలు ఆడియన్స్ లో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. ఇక ఈ మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా ఆరు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. విషయం ఏమిటంటే తాజాగా పుష్ప 2 మూవీ యొక్క స్పెషల్ బెనిఫిట్ షోస్ ని డిసెంబర్ 4న రాత్రి 9.30 నుండి స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ స్పెషల్ షోస్ యొక్క టికెట్ ధరలు వెయ్యి రూపాయలుగా నిర్ణయించారు.

అయితే ఈ ప్రీమియర్ షోస్ కి చాలా వరకు రెస్పాన్స్ రావడం లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ తప్ప పలువురు ఇతరలెవరూ కూడా సినిమా చూసేందుకు ఆసక్తి చూపించలేదని గతంలో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ సినిమాలకు భారీగా బెనిఫిట్స్ కొనుగోలు చేయగా ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం దీనికి కారణం అని అంటున్నాయి సినీ వర్గాలు. మరి మరొక నాలుగు రోజుల్లో ప్రదర్శితం కానున్న పుష్ప 2 స్పెషల్ స్టోలు ఏ స్థాయిలో రెస్పాన్స్ సంపాదించుకుంటాయో అలానే మూవీ ఏ రేంజ్ లో విజయవంతం అవుతుందో చూడాలని అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version