Home సినిమా వార్తలు Pushpa 2 ticket price 1000 ‘పుష్ప 2’ టికెట్ రేట్ రూ. 1000

Pushpa 2 ticket price 1000 ‘పుష్ప 2’ టికెట్ రేట్ రూ. 1000

Allu Arjun

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ పై తాజాగా తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ పుష్ప 2. ఈ మూవీపై ప్రారంభం నుంచి అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ తో పాటు థియేటర్ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుని అందరిలో మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి. పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానుంది. విషయం ఏమిటంటే పుష్ప 2 మూవీ యొక్క ప్రీమియర్స్ ని డిసెంబర్ 4న రాత్రి 9:30 నుంచి ప్రదర్శించనున్నారు.

ఆంధ్ర, తెలంగాణలో దీనికి భారీ స్థాయిలో అయితే క్రేజ్ వచ్చే అవకాశం కనబడుతోంది. ఇక ఆంధ్రలో ఈ స్పెషల్ షోస్ టికెట్ ధరని అధికారికంగా రూ.1000 గా నిర్ణయించారు. ఎప్పటినుంచో అందరిలో భారీ స్థాయిలో క్రేజ్ కలిగిన సీక్వెల్ అయిన పుష్ప 2 ఏ స్థాయిలో ప్రీమియర్స్ రెస్పాన్స్ ని సంపాదించుకుంటుందో తెలియాలంటే మరొక నాలుగు రోజులు వెయిట్ చేయకతప్పదు

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version