టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 మొదటి నుంచి అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచి మొన్న గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఇక ఈ మూవీ ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ అయితే సంపాదించింది. ఇక డే వన్ మొత్తంగా ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో అత్యధిక గ్రాస్ సొంతం చేసుకున్న ఇండియన్ మూవీ గా రూ. 280 కోట్ల భారీ కలెక్షన్ అయితే అందుకుంది.
ఇక హిందీ బెల్ట్ లో ఈ మూవీ మరింతగా కలెక్షన్ అయితే అందుకుంటూ కొనసాగుతోంది. రెండో రోజు ఈ మూవీ హిందీలో రూ. 65కోట్ల నెట్ ని అందుకే ఛాన్స్ ఉండగా కేరళలో 70 శాతం ఈ మూవీ రెండో రోజు డ్రాప్ అయి రూ. 2.25 కోట్లని మరో వైపు తమిళనాడులో రూ. 7 కోట్లు అందుకుంది. ఇక తెలుగు స్టేట్స్ లో రూ. 30 కోట్లు అలానే కర్ణాటకలో కూడా కలిపి మొత్తంగా పుష్ప డే 2కి రూ. 105 కోట్లకు గ్రాస్ ఇండియాలో దక్కించుకునే అవకాశం ఉంది.
మరోవైపు ఓవర్సీస్ లో మరొక రూ. 35 కోట్లు అనగా మొత్తం వరల్డ్ వైడ్ అయితే రూ. 140 కోట్లు పుష్ప 2 రెండవ రోజు రాబట్టొచ్చు. ఇక వరల్డ్ వైడ్ డే 1 రూ. 280 కోట్లు అలానే డే 2 దాదాపుగా రూ. 140 కోట్లు మొత్తంగా రెండు రోజుల్లో కలిపి ఈ మూవీ రూ. 400 కోట్లు గ్రాస్ మార్క్ అయితే చేరుకోనుంది. మరి ఓవరాల్ గా పుష్ప 2 ఎంత రాబడుతుందో చూడాలి