ప్రస్తుతం కెరియర్ పరంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా వరుసగా పలు ప్రాజెక్ట్స్ చేస్తూ కొనసాగుతున్నారు. ఆ సినిమాలన్నిటిపై కూడా ప్రభాస్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ముఖ్యంగా వీటిలో ఇటీవల సీతారామం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న హను రాఘవపూడి ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న ఫౌజీ పై మరింతగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో ప్రముఖ పాకిస్తాన్ నటి ఇమాన్వి కథానాయక నటిస్తుండగా దీనిని మైత్రి మూవీ మేకర్ సంస్థ గ్రాండ్ లెవెల్ అయితే నిర్మిస్తుంది. పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఇది రూపొందుతోంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని 2026 సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ అన్నీ కూడా రికార్డింగ్ పూర్తయ్యాయని త్వరలో ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్కటిగా అప్డేట్స్ ని రిలీజ్ చేసేందుకు మేకర్ సిద్ధమవుతున్నారని చెప్తున్నారు. అయితే ఫౌజీ రిలీజ్ డేట్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో రానుందట.