Homeసినిమా వార్తలుVenkatesh Enters into 250 Crore Club రూ.250 కోట్ల క్లబ్ లో చేరిన విక్టరీ వెంకటేష్ 

Venkatesh Enters into 250 Crore Club రూ.250 కోట్ల క్లబ్ లో చేరిన విక్టరీ వెంకటేష్ 

- Advertisement -

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తాజాగా నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతి వస్తున్నాం. యువ అందాల కథానాయికలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ కు నటించిన ఈ మూవీకి భీమ్ సిసిలోరియో సంగీతం అందించగా వరుస సినిమాల విజయాలతో దూసుకెళుతున్న యువ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దీన్ని తెరకెక్కించారు. 

కామెడీతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ గా రూపొందిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా ఇతర కీలక పాత్రల్లో సాయికుమార్, నరేష్, మాస్టర్ రేవంత్, పృథ్వీ కనిపించారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ రూ. 250 కోట్లకు పై గ్రాస్ కలెక్షన్ సొంతం చేసుకుని కెరీర్ పరంగా వెంకటేష్ కి బిగ్గెస్ట్ హిట్ ని అందించింది. 

అలానే ఈ స్థాయి కలెక్షన్లు అందుకున్న సీనియర్ తొలి స్టార్ హీరోగా నిలిచారు విక్టరీ వెంకటేష్. మరోవైపు ఈ సినిమా ఇప్పటికే చాలా ఏరియాలో ఇంకా మంచి కలెక్షన్లతో కొనసాగుతూ ఉండటంతో ఓవరాల్ గా ఇది రూ. 300 కోట్ల వరకు చేరుకునే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి మొత్తంగా సంక్రాంతికి వస్తున్నాం ఏ స్థాయి బాక్సాఫీస్ నెంబర్స్ ని కొల్లగొడుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాలి.  

READ  Benefit Shows and Ticket Hikes no more in Telangana ఇకపై తెలంగాణలో బెనెఫిట్ షోలు, రేట్స్ పెంపు రద్దు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories