Home సినిమా వార్తలు ‘స్పిరిట్’ : త్రిప్తి డిమ్రి పై ప్రభాస్ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇదే

‘స్పిరిట్’ : త్రిప్తి డిమ్రి పై ప్రభాస్ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇదే

spirit

అతి త్వరలో ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న భారీ యాక్షన్ సినిమా స్పిరిట్. ఇందులో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించనుండగా ఆయన సరసన దీపికా పదుకొనే నటించనున్నారనే వార్తలు ఇటీవల వచ్చాయి. అయితే కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్టు కూడా లేటెస్ట్ గా న్యూస్ వచ్చింది.

ఇక తమ సినిమాలో ఆనిమల్ నటి త్రిప్తి డిమ్రిని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు స్వయంగా సందీప్ రెడ్డి వంగా అనౌన్స్ చేశారు. భారీ స్థాయిలో గ్రాండ్ లెవెల్ లో రూపొందనున్న ఈ సినిమాని భద్రకాళి మూవీస్, టి సిరీస్ ఫిలింస్ సంస్థలు గ్రాండ్ లెవెల్ లో నిర్మించునున్నాయి. 

అయితే విషయం ఏమిటంటే ఇందులో హీరోయిన్ గా త్రిప్తిని ప్రకటించిన అనంతరం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు పలు ఆడియన్స్ లో కూడా మిశ్రమ స్పందన అయితే వస్తోంది. టాప్ స్థానంలో ఉన్న ఒక అగ్ర నటిని ఇందులో హీరోయిన్ గా తీసుకుంటారని అందరూ భావించారు. కానీ త్రిప్తిని తీసుకోవడం కొందరికి రుచించడం లేదు.

ఆనిమల్ సినిమాలో ఆమె రెండో హీరోయిన్ పాత్ర చేసి అందర్నీ మెప్పించిన విషయం తెలిసిందే. అది మెచ్చినటువంటి సందీప్ రెడ్డి వంగా ఇందులో ఆమెకి మెయిన్ హీరోయిన్ లీడ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన స్పిరిట్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుండగా వచ్చే ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. మరి స్పిరిట్ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version