Home సినిమా వార్తలు విక్టరీ వెంకటేష్ తో త్రివిక్రమ్ మూవీ ఫిక్స్ ?

విక్టరీ వెంకటేష్ తో త్రివిక్రమ్ మూవీ ఫిక్స్ ?

venkatesh trivikram

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన మూవీ గుంటూరుకారం. మంచి అంచనాలతో రిలీజ్ అయి ఫస్ట్ డే నెగటివ్ టాక్ అందుకున్నప్పటికీ చాలా ఏరియాల్లో ఈ మూవీ బ్రేకీవెన్ అందుకుంది.

ఇక ఆ మూవీ అనంతరం అల్లు అర్జున్ తో తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసారు త్రివిక్రమ్. మరోవైపు ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం మూవీతో అతిపెద్ద బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ మూవీ యొక్క కథా చర్చల్లో ఉన్నారు.

అయితే అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ చేయనున్న మూవీ భారీ స్థాయిలో రూపొందనున్న మైథలాజికల్ ఎంటర్టైనర్ కావడంతో అది మొదలెట్టడానికి చాలానే టైం పట్టేలా ఉందట.

అందుకే తాజాగా అట్లీతో మూవీ అనౌన్స్ చేసారు అల్లు అర్జున్. ఇక ఈలోపు మరొక నటుడితో ఒక సినిమా చేయాలనుకున్న త్రివిక్రమ్, తాజాగా వెంకటేష్ కి మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీ వినిపించారని, త్వరలో ఒక అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించనున్న ఆ మూవీ యొక్క పూర్తి వివరాలు అధికారికంగా రానున్నాయని తెలుస్తోంది. 

వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ రానుందని ఎన్నో ఏళ్ళ నుండి రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఇప్పుడు సెట్ అవ్వడంతో వెంకీ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెంకీ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ కథ, మాటలు అందించారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version