స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉండటంతో పాటు తాజాగా తన సినిమాలకు సంబంధించిన మిగిలిన షెడ్యూల్స్ ని పూర్తి చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే హరిహర వీరమల్లుకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసిన పవన్ లేటెస్ట్ గా ఓజి మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు రెడీ అయ్యారు.
ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా సుజిత్ దీనిని తెరకెక్కిస్తున్నారు. నేడు పవన్ కళ్యాణ్ ఈ మూవీ యొక్క షూట్లో జాయిన్ అవ్వనున్నారు. దీంతో పాటు జూన్ రెండో వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా యొక్క షూటింగ్లో కూడా ఆయన పాల్గొని ఉన్నారు. ఈ సినిమాపై కూడా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
హరీష్ శంకర్ దీనిని తెరకెక్కిస్తున్నారు. మొత్తంగా మూడు సినిమాలు కూడా పవన్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునేలా ఆయా దర్శక నిర్మాతలు అద్భుతంగా రూపొందియించి ఆడియన్సు ముందుకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక వీటిలో హరిహర వీరమల్లు జూన్ 13న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుండగా అనంతరం సెప్టెంబర్ 5న ఓజి అలానే వచ్చే ఏడాది సమ్మర్ లో ఉస్తాద్ భగత్ సింగ్ ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.