తెలుగు సినిమా పరిశ్రమలో రానున్న జూన్ నెలలో వరుసగా పలు క్రేజీ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 13న రిలీజ్ కి సిద్ధం అవుతుంది. పవన్ తాజాగా తన పార్ట్ షూటింగ్ ని పూర్తి చేయగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా నిర్వహిస్తోంది టీం.
ఇక దీని అనంతరం జూన్ 20న కింగ్ నాగార్జున వెర్సటైల్ యాక్టర్ ధనుష్ కాంబినేషన్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న కుబేర మూవీ ఆడియన్స్ ముందుకు రానుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. వీటితోపాటు విష్ణు మంచు ప్రధాన పాత్రలో రూపొందుతోన్న భక్తకన్నప్ప సినిమా కూడా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ సినిమాని జూన్ 27న ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఎంతో గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక బాలీవుడ్ లో చూసుకుంటే అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సితారే జమీన్ పర్ కూడా జూన్ లోనే రానుంది.
ఈ మూవీ యొక్క ట్రైలర్ తాజాగా రిలీజ్ అయి అందరి నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇది జూన్ 24 స్పానిష్ మూవీ కాంపియోన్స్ కి అఫీషియల్ రీమేక్ అనేది తెలిసిందే. ఇక వీటితోపాటు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న తగ్ లైఫ్ కూడా జూన్ 5న ఆడియన్స్ ముందుకు రానుంది. మొత్తంగా వీటిలో ఏ సినిమా ఏ స్థాయి విజయవంతం అందుకుంటుందో చూడాలి.