Home సినిమా వార్తలు ‘ఓదెల – 2’ : అసలు ఊహించలేదుగా

‘ఓదెల – 2’ : అసలు ఊహించలేదుగా

odela 2

తాజాగా సంపత్ ఉంది నిర్మాణంలో ప్రముఖ స్టార్ కథానాయక తమన్నా భాటియా ప్రధాన పాత్రలో వశిష్ట, హెబ్బా పటేల్ ముఖ్య పాత్రల్లో రూపొందిన మూవీ హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ఓదెల 2. ఈ సినిమాపై మొదటి నుంచి కూడా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల రిలీజై విజయం అందుకున్న ఓదెల రైల్వే స్టేషన్ మూవీకి సీక్వెల్ గా ఇది రూపొందింది. అశోక్ తేజ దీనిని తెరకెక్కించారు.

అయితే మొన్న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఓదెల 2 మూవీ అందరి నుంచి నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కథా కథనాలు ఏమాత్రం ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో పాటు తమన్న పాత్ర కూడా ఎవరిని అలరించలేదు. ఆ పాత్రలో ఆమె యాక్టింగ్ బాగున్నప్పటికీ దర్శకుడు రాసుకున్న స్క్రిప్ట్ అలానే కథనం ఏ మాత్రం ఆసక్తికరంగా లేదు. అంతా పాత మూస పద్దతిలో సాగుతుంది.

దానితో ఈ సినిమా మొదట రోజు చాలా తక్కువ కలెక్షన్ సొంతం చేసుకుని ఓవరాల్ గా రూ. 1 కోటి గ్రాస్ మాత్రమే అందుకుంది. ఇక ఈ సినిమా ఓవరాల్ గా రూ. 20 కోట్ల మార్కుని చేరుకోవాల్సి ఉంది. అది అసాధ్యం అని, మూవీ డిజాస్టర్ గా నిలిచే అవకాశం ఉందని ప్రస్తుత బాక్సాఫీస్ పరిస్థితిని బట్టి ఆల్మోస్ట్ మనకు అర్ధం అవుతుంది.

ఇప్పటికే అందరి నుంచి నెగిటివ్ టాక్ సంపాదించుకున్న సినిమా మరి అంత భారీ కలెక్షన్ ఏ స్థాయిలో అందుకుంటుందో చూడాలి. మరోవైపు ప్రమోషన్స్ లో కూడా తమ సినిమా అందర్నీ అలరించి మంచి విజయం అనుకుంటుందని నిర్మాత సంపత్ నందితో పాటు ఓదెల 2 టీమ్ అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. మరి ఓవరాల్ గా ఇది ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version