Home సినిమా వార్తలు Naveen Polishetty doing a Movie with Maniratnam మణిరత్నం దర్శకత్వంలో మూవీ చేయనున్న నవీన్...

Naveen Polishetty doing a Movie with Maniratnam మణిరత్నం దర్శకత్వంలో మూవీ చేయనున్న నవీన్ పోలిశెట్టి ?

naveen polishetty

మన భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ సీనియర్ దర్శకుల్లో మణిరత్నం కూడా ఒకరు. ఇటీవల ఆయన తెరకెక్కించిన భారీ పాన్ ఇండియన్ మూవీస్ అయిన పొన్నియన్ సిరీస్ లోని రెండు సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి. అందులో పార్ట్ వన్ మరింత భారీ విజయమైతే అందుకుంది. తాజాగా లోకనాయకుడు కమలహాసన్ తో కలిసి థగ్ లైఫ్ అనే యాక్షన్ సినిమా చేస్తున్నారు మణిరత్నం. 

ఈ సినిమాపై అందరిలో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు టీమ్ వేగంగా పనిచేస్తోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. మరోవైపు ఇటీవల శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయం అందుకున్నారు యువ నవీన్ పోలిశెట్టి. ప్రస్తుతం మారి దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. 

ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇది సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే విషయం ఏమిటంటే అతి త్వరలో మణిరత్నంతో నవీన్ పోలిశెట్టి ఒక సినిమా చేయనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ప్రస్తుతం కమల్ తో చేసుకున్న థగ్ లైఫ్ అనంతరం నవీన్ పోలిశెట్టితో మణిరత్నం సినిమా చేయనున్నారని అంటున్నారు. 

మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుందని టాక్. త్వరలో దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట. ఇప్పటికే జాతి రత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ఇటీవల వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలతో నటుడిగా మంచి క్రేజ్ అందుకున్న నవీన్, మణిరత్నంతో సినిమాతో ఇంకెంతమేర అలరిస్తారో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version