Home సమీక్షలు Saripodhaa Sanivaaram Review ‘సరిపోదా శనివారం’ రివ్యూ

Saripodhaa Sanivaaram Review ‘సరిపోదా శనివారం’ రివ్యూ

Saripodhaa Sanivaaram

టాలీవుడ్ నటుడు నాచురల్ స్టార్ నాని హీరోగా యువ అందాల నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. ఈమూవీని ప్రముఖ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఎస్ జె సూర్య నెగటివ్ పాత్ర చేసిన ఈ మూవీ నేడు మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకి వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

సరిపోదా శనివారం సినిమాతో నాని మళ్లీ మంచి సినిమా అందించాడు. ఇక నాని, ఎస్‌జె సూర్య, జేక్స్, వివేక్ ఆత్రేయ కలిసి మంచి కమర్షియల్ సినిమాని అందించారని చెప్పకతప్పదు. బలహీనమైన రొమాంటిక్ ట్రాక్ వంటి లోపాలు అలానే కొన్ని డ్రాగ్ చేసిన సన్నివేశాలు ఉన్నప్పటికీ మూవీ మెప్పిస్తుంది.

దసరా మరియు హాయ్ నాన్న తర్వాత నాని సరిపోద శనివారంతో మళ్లీ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుందని భావిస్తున్నారు. ప్రారంభ ప్రీమియర్‌లు మరియు షోల నుండి సానుకూలంగా ఉన్నందున బుకింగ్‌లు కూడా బాగానే ప్రారంభమయ్యాయి. నాని టాప్ 2 బిగ్గెస్ట్ గ్రాసర్స్‌లో ఈ సినిమా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా కెరీర్ పరంగా నాచురల్ స్టార్ హ్యాట్రిక్ కొట్టడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్లస్ పాయింట్స్ :

నాని మరియు ఎస్ జె సూర్య
సంగీతం
నాని, ఎస్‌జె సూర్య ఫేస్ ఆఫ్ సన్నివేశాలు
ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్‌లు
కొన్ని వినోదాత్మక సీన్స్

మైనస్ పాయింట్స్ :

లవ్ ట్రాక్
ఎమోషనల్ సీన్స్
సుదీర్ఘమైన మరియు ఊహించదగిన సన్నివేశాలు
బలహీనమైన కథా రచన

మొత్తంగా నాని, ఎస్ జె సూర్య ల సూపర్ పెర్ఫార్మన్స్ తో పాటు ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందిన సరిపోదా శనివారం మూవీ సక్సెస్ టాక్ అందుకోవడంతో రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎంతమేర రాబడుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version