Home సమీక్షలు Double Imsart First Half Review ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ హాఫ్ రివ్యూ

Double Imsart First Half Review ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ హాఫ్ రివ్యూ

double ismart
double ismart

ఉస్తాద్ రామ్ హీరోగా డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఐదేళ్ల క్రితం ఆడియన్స్ ముందుకి వచ్చిన సూపర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కి ఇది సీక్వెల్. కావ్య థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ గ్రాండ్ గా నిర్మించారు.

మణిశర్మ సంగీతం అందించిన ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ గా చేసారు. ఇక ఎన్నో అంచనాలతో నేడు ఆడియన్స్ ముందుకి వచ్చిన ఇంసార్ట్ శంకర్ మూవీ ఫస్ట్ హాఫ్ ఇప్పుడే పూర్తయింది. ఇక ఈ ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా సాగిందని చెప్పాలి. హీరో రామ్ ఎనర్జీ, సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టెప్పా మార్ సాంగ్ మరియు కొన్ని ఎపిసోడ్‌లు బాగానే వర్కౌట్ అయ్యాయి.

అయితే, లీడ్ పెయిర్ మధ్య రొమాన్స్ ట్రాక్, నటుడు ఆలీ బోకా ట్రాక్ మరియు క్యా లఫ్డా పాట ఆకట్టుకోలేకపోయాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. మరి సినిమాని మలుపు తిప్పడానికి అవసరమైన బలమైన అంశాలు సెకండాఫ్ లో ఉంటాయో లేదో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version