Home సినిమా వార్తలు Dasara Movie Bags Many Filmfare Awards ఫిలిం ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన నాని...

Dasara Movie Bags Many Filmfare Awards ఫిలిం ఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన నాని ‘దసరా’

Dasara team
Dasara team

నాచురల్ స్టార్ నాని హీరోగా అందాల నటి కీర్తి సురేష్ హీరోయిన్ గా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ పై సుధాకర్ చెరుకూరి గ్రాండ్ లెవెల్లో నిర్మించిన మూవీ దసరా. గత ఏడాది ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్న ఈ మూవీలో హీరో నాని తన అలరించే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు.

దీక్షిత్ శెట్టి, దసరా సిద్దు, షైన్ టామ్ చాకో, సముద్రఖని, రఘుబాబు, సాయికుమార్ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ మూవీ తాజాగా జరిగిన 69వ ఫిలిం ఫేర్ అవార్డుల్లో సత్తా చాటి అనేక విభాగాల్లో అవార్డులని సొంతం చేసుకుంది.

ముందుగా ఉత్తమ నటుడిగా నాచురల్ స్టార్ నాని, ఉత్తమ నటిగా హీరోయిన్ గా కీర్తి సురేష్, ఉత్తమ సినిమాటోగ్రాఫ‌ర్‌గా స‌త్య‌న్ సూర‌న్‌తో పాటు ప్రొడ‌క్ష‌న్ డిజైన్ (అవినాష్ కొల్లా), కొరియోగ్ర‌ఫీ (ప్రేమ్ ర‌క్షిత్‌) విభాగాల్లో ద‌స‌రా మూవీకి ఫిల్మ్ ఫేర్ అవార్డులు వ‌చ్చాయి. మొత్తంగా తమ చిత్రానికి ఇన్ని విభాగాల్లో అవార్డులు దక్కడంతో దసరా టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version