Home సినిమా వార్తలు Actor Nani 2023 అవార్డ్స్ నామినేషన్స్ లో నాని మూవీస్ హవా

Actor Nani 2023 అవార్డ్స్ నామినేషన్స్ లో నాని మూవీస్ హవా

actor nani

యువ నటుడు నాచురల్ స్టార్ నాని ఇటీవల శ్రీకాంత్ ఓదెల తో చేసిన పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ దసరాతో పాటు మరొక యువ దర్శకుడు శౌర్యువ్ తో చేసిన ఫ్యామిలీ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ హాయ్ నాన్న మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి రెండు మూవీస్ తో మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు.

దసరా లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇక హాయ్ నాన్న లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించారు. ఈ రెండు సినిమాల్లో కూడా తన అద్భుత నటనతో ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని అలరించారు నాని.

విషయం ఏమిటంటే, తాజగా 2023 ఫిలిం ఫేర్, సైమా అవార్డుల్లో నాని నటించిన ఈ రెండు సినిమాలు భారీగా నామినేషన్స్ లో నిలిచాయి. హాయ్ నాన్న 10 సైమా, 9 ఫిలిం ఫేర్ అలానే దసరా 11 సైమా, 8 ఫిలిం ఫేర్ క్యాటగిరిల్లో నామినేషన్స్ లో నిలిచాయి. మరి వీటిలో ఈ రెండు సినిమాల్లో ఏయే క్యాటగిరిలో అవార్డులు సొంతం చేసుకుంటాయనేది తెలియాలి అంటే మరికొద్దిరోజుల వరకు ఆగాల్సిందే.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version