Home సినిమా వార్తలు Bharateeyudu 2 Run Time Trim ‘భారతీయుడు – 2’ : చేతులు కాలాక ఆకులు...

Bharateeyudu 2 Run Time Trim ‘భారతీయుడు – 2’ : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వ్యర్థం

bharateeyudu 2 run time trim

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ పేట్రియాటిక్ ఎంటర్టైనర్ మూవీ భారతీయుడు 2. 1996లో రిలీజ్ అయి సంచలన విజయం అందుకున్న భారతీయుడుకి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్ధ, ఎస్ జె సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించగా అనిరుద్ సంగీతం అందించారు.

ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నెగటివ్ టాక్ తో ప్రస్తుతం డిజాస్టర్ దిశగా కొనసాగుతోంది. కాగా విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఈ మూవీ నెగటివ్ అంశాల్లో ఒక కారణం భారీ రన్ టైం కావడంతో నిన్నటి నుండి ఈ మూవీ యొక్క రన్ టైంని 12 నిముషాలు ట్రిమ్ చేసినట్లు మేకర్స్ అఫీషయల్ గా అనౌన్స్ చేసారు.

అయితే దీని పై పలువురు ఆడియన్స్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు, ఇప్పటికే మూవీకి చాలావరకు డ్యామేజ్ జరిగిందని, కథ కథనంలో లోపంతో పాటు భారీ రన్ టైం కూడా ఇబ్బందిగా మారగా, దానిని కొద్దిగా ట్రిమ్ చేసినంత మాత్రాన మూవీకి అది ఏమాత్రం ఉపయోగడం ఉండదనేది వారి అభిప్రాయం. కాగా చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వ్యర్ధమనేది మెజారిటీ ఆడియన్స్ అంటున్న మాట. మరి మొత్తంగా క్లోజింగ్ లో ఈ మూవీ ఎంతమేర రాబడుతుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version