Home సినిమా వార్తలు Vishwambhara Climax Shoot ‘విశ్వంభర’ క్లైమాక్స్ కోసం భారీ యాక్షన్

Vishwambhara Climax Shoot ‘విశ్వంభర’ క్లైమాక్స్ కోసం భారీ యాక్షన్

vishwambhara

మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యువి క్రియేషన్స్ సంస్థ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అవుతున్న లేటెస్ట్ భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర. ఈ మూవీని బింబిసార మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తుండగా ఆస్కార్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

భీమవరం దొరబాబు పాత్రలో మెగాస్టార్ మంచి మాస్ రోల్ చేస్తున్న ఈ మూవీలో ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి, సురభి, ఆషిక రంగనాథ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ తాజాగా ప్రారంభించింది మూవీ యూనిట్.

ఇక ఈ భారీ యాక్షన్ సీన్స్ కోసం ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ అనల్ అరసుని ఎంపిక చేసారు విశ్వంభర టీమ్. ఆయన సారధ్యంలో ఈ క్లైమాక్స్ సీన్స్ అత్యద్భుతంగా సిద్దమవుతున్నాయని అంటున్నారు మేకర్స్. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు మేకర్స్. మరి అందరిలో అందరిలో మంచి క్రేజ్ కలిగిన విశ్వంభర ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version