Home సినిమా వార్తలు Vishwambhara Teaser Update ‘విశ్వంభర’ : మెగాస్టార్ బర్త్ డే సర్ప్రైజింగ్ లోడింగ్

Vishwambhara Teaser Update ‘విశ్వంభర’ : మెగాస్టార్ బర్త్ డే సర్ప్రైజింగ్ లోడింగ్

vishwambhara teaser update

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విశ్వంభర. ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, సురభి, హర్ష వర్ధన్, వెన్నెల కిషోర్, ఆషిక రంగనాథ్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు.

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. విషయం ఏమిటంటే, ప్రస్తుతం శరవేంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ఆగష్టు 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

త్వరలో దీనికి సంబంధించి టీమ్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట. భీమవరం దొరబాబుగా మెగాస్టార్ చిరంజీవి మాస్ పాత్ర చేస్తున్న ఈ మూవీని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా అన్ని కార్యక్రమాలు ముగించి 2025 జనవరి 10 న ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. మరి మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన విశ్వంభర మూవీ రిలీజ్ అనంతరం ఏ రేంజ్ లో సక్సెస్ అవుతోందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version