Home సినిమా వార్తలు Mahesh Voice for Mufasa was Impressive ‘ముఫాసా’ : ఆకట్టుకుంటున్న మహేష్ బాబు వాయిస్

Mahesh Voice for Mufasa was Impressive ‘ముఫాసా’ : ఆకట్టుకుంటున్న మహేష్ బాబు వాయిస్

mufasa mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB29 తెరకెక్కునున్న విషయం తెలిసిందే. అతిత్వరలో ప్రారంభం కానున్న ఈ భారీ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుగుతోంది.

కేఎల్ నారాయణ గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్న ఈ మూవీ కోసం యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. విషయం ఏమిటంటే, తాజాగా హాలీవుడ్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ మూవీ యొక్క తెలుగు వర్షన్ లో ముఫాసా పాత్రకు సూపర్ స్టార్ మహేష్ బాబు తన వాయిస్ ని అందించిన విషయం తెలిసిందే. ఈ మూవీ యొక్క తెలుగు ట్రైలర్ ని ప్రస్తుతం యూట్యూబ్ లో రిలీజ్ చేయగా దానికి మంచి స్పందన లభిస్తోంది.

హిందీలో షారుఖ్ వాయిస్ అందించిన ఈమూవీ డిసెంబర్ 6న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. బారీ జెంకిన్స్ తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు వర్షన్ కి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం కనపడుతోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version