Home సినిమా వార్తలు Priyanka Mohan hurts Vijay Fans విజయ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన ప్రియాంక మోహన్

Priyanka Mohan hurts Vijay Fans విజయ్ ఫ్యాన్స్ ని హర్ట్ చేసిన ప్రియాంక మోహన్

priyanka mohan

యువ అందాల కథానాయిక ప్రియాంక మోహన్ ప్రస్తుతం వసరుసగా పలు సినీ అవకాశాలతో మంచి క్రేజ్ తో కొనసాగుతున్నారు. ఇటీవల ధనుష్ హీరోగా తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి ఆడియన్స్ ని అలరించిన ఈ భామ తాజాగా తెలుగులో నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న మాస్ యాక్షన్ మూవీ సరిపోదా శనివారం ద్వారా ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకి రానున్నారు.

డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించిన ఈమూవీ సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఎస్ జె సూర్య నెగటివ్ పాత్ర చేస్తున్న ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ప్రియాంక మాట్లాడుతూ, ఒకవేళ భవిష్యత్తులో ఖుషి 2 మూవీ తీస్తే పవన్ కళ్యాణ్ తో మాత్రమే తీయాలని ఆమె సూర్య ని కోరారు. వాస్తవానికి ఈ మూవీని తొలుత తమిళ్ లో తీశారు సూర్య.

విజయ్ హీరోగా రూపొందిన ఆ మూవీ అక్కడ సూపర్ హిట్ కొట్టిన అనంతరం తెలుగులో పవన్ తో తీయగా ఇక్కడ కూడా బాగా ఆడింది. అయితే ప్రియాంక ఖుషి 2 మూవీని పవన్ తో తీయమని కోరడంతో ఒకింత విజయ్ ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. కొందరు ఆమె కామెంట్స్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version