Home సినిమా వార్తలు Kanguva Release Trailer is Crucial కీలకంగా మారిన ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్

Kanguva Release Trailer is Crucial కీలకంగా మారిన ‘కంగువ’ రిలీజ్ ట్రైలర్

kanguva

కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య హీరోగా సిరుతై శివ దర్శకత్వంలో తరుక్కుతున్న లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ కంగువ. స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలపై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్ ఇండియన్ రేంజ్ లో తెరకెక్కుతున్న కంగువ సినిమా నవంబర్ 14 న పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది.

బాలీవుడ్ అందాల నటి దిశ పటాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా యానిమల్ నటుడు బాబి డియల్ ఇందులో విలన్ పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే కంగువ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్, టీజర్, పోస్టర్లు అన్నీ కూడా అందర్నీ ఆకట్టుకుని సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. అయితే యుఎస్ఏ లో మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయి బుకింగ్స్ అందుకోలేకపోతుంది.

మరోవైపు ఈ సినిమా యొక్క రిలీజ్ ట్రైలర్ ని నేడు రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ యొక్క రన్ టైం 2 నిమిషాల 37 సెకండ్లు సాగనుండగా ఖచ్చితంగా ఈ ట్రైలర్ మరింతగా సినిమాపై అంచనాలు పెంచుతుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అలానే ట్రైలర్ చూసాక ప్రీ బుకింగ్స్ పరంగా కూడా సినిమాపై ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మరింతగా ఆసక్తి ఏర్పరుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి అందరిలో మంచి హైప్ కలిగిన కంగువ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అనుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version