Home సినిమా వార్తలు Disappointing News for Pawan Fans on this Diwali దీపావళికి పవన్ ఫ్యాన్స్ కి...

Disappointing News for Pawan Fans on this Diwali దీపావళికి పవన్ ఫ్యాన్స్ కి నిరాశేనా ?

Hari Hara Veera Mallu

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కెరీర్ పరంగా చేస్తున్న మూడు సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఈ భారీ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కొంత భాగాన్ని కృషి జాగర్లమూడి తెరకెక్కించగా మిగతా భాగాన్ని ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ తీస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ వ్యయంతో నిర్మితమవుతున్న హరిహర వీరమల్లు పార్ట్ 1 మూవీ ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం మిగతా భాగం వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు యూనిట్.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో గజదొంగ వీరమల్లుగా ఒక పవర్ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తుండగా ఇతర కీలకపాత్రలో నర్గీస్ ఫక్రి, అలానే నోరా ఫతేహి, జిషు సేన్ గుప్తా, పూజిత పొన్నాడ నటిస్తున్నారు. విషయం ఏమిటంటే హరిహర వీరమల్లు నుంచి దీపావళికి ఒక సాంగ్ రానుందనే వార్తలు కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్నాయి.

ఇక లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల ప్రకారం ఈ మూవీ నుంచి దీపావళి సందర్భంగా కేవలం పోస్టర్ మాత్రం రిలీజ్ కానుందని ఆపై కొన్నాళ్ల అనంతరం ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. ఒకరకంగా ఇది పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి నిరాశే అని చెప్పాలి. ఇక అన్ని కార్యక్రమాలు ముగించి హరిహర వీరమల్లు మూవీని వచ్చి ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version