Home సినిమా వార్తలు Prashant Neel clarity on Salaar vs Dunki Clash సలార్ vs డన్కి బాక్సాఫిస్...

Prashant Neel clarity on Salaar vs Dunki Clash సలార్ vs డన్కి బాక్సాఫిస్ క్లాష్ పై ప్రశాంత్ నీల్ వివరణ

prashanth neel

ప్రముఖ కన్నడ దర్శకుడు ప్రశాంత నీల్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ఆడియన్స్ అందరికీ కూడా ఎంతో సుపరిచితం. ముఖ్యంగా ఆయన తీసిన పాన్ ఇండియన్ మూవీస్ అయిన కేజీఎఫ్ సిరీస్ లోని రెండు సినిమాలు ఎంతో భారీ విజయాలు అందుకుని ఒకదాన్ని మించేలా మరొకటి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా గ్రాండ్ గా తెరకెక్కించిన కే జి ఎఫ్ సినిమాలతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించారు.

వాటి అనంతరం ప్రభాస్ హీరోగా ప్రశాంత్ తెరకెక్కించిన సలార్ మూవీ కూడా భారీ విజయం అందుకుంది. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే మూవీ చేస్తున్నారు ప్రశాంత్ నిల్. దీని అనంతరం ప్రభాస్ తో సలార్ 2 మూవీ కూడా చేయనున్నారు. ఇక ప్రశాంత నీల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ గత ఏడాది షారుఖ్ డన్కి తో పటు తమ సినిమా సలార్ ఒకేరోజు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం పై వివరణ ఇచ్చారు.

ఆయన మాట్లాడుతూ నిజానికి షారుక్ ఖాన్ మరియు దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ఇద్దరు కూడా డన్కి మూవీ రిలీజ్ డేట్ ని ఒక ఏడాది ముందే అనౌన్స్ చేశారన్నారు. అయితే తమ సినిమా కూడా పక్కాగా అదే రోజు రిలీజ్ చేయడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని అప్పటికే షూటింగ్ మొత్తం కూడా చకచగా జరగటం, అలానే సరిగ్గా అదే టైంకి రిలీజ్ కూడా ప్లాన్ చేయక తప్పకపోవడంతో ఆ డేట్ కి తాము రావలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అందుకే ఈ విషయమై షారుక్ ఖాన్ గారికి అలానే డన్కి టీంకి తమ తరఫున క్షమాపణ చెప్తున్నాని మాట్లాడారు ప్రశాంత్ నీల్

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version