టాలీవుడ్ యువ నటులు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ, ప్రియాంక జవాల్కర్ ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీని యువ దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించారు. బీమ్స్ సిసిలోరియో సంగీతం అందించిన ఈ మూవీకి రాక్ స్టార్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.
ఇటీవల మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుని ప్రస్తుతం బాగా కలెక్షన్ తో కొనసాగుతోంది. మంచి యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా అందరినీ ఆకట్టుకుంటున్న మ్యాడ్ స్క్వేర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, హారిక, సాయి సౌజన్య నిర్మించారు.
ఇక తమ మూవీ ఇంత పెద్ద విజయం అందుకోవడంతో ఇటీవల చిన్న సక్సెస్ పార్టీ చేసుకున్న టీమ్, ఆడియన్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విషయం ఏమిటంటే, మ్యాడ్ స్క్వేర్ మూవీ యొక్క సక్సెస్ మీట్ రేపు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ గా జరగనుండగా టాలీవడ్ స్టార్ యాక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దీనికి ప్రత్యేక అతిథిగా రానున్నారు. ఎన్టీఆర్ రానుండడంతో ఈ ఈవెంట్ కి భారీగా ఫ్యాన్స్ తరలిరానున్నారని, అందుకోసం ఏర్పాట్లు కూడా జాగ్రత్తగా చేస్తోందట మ్యాడ్ స్క్వేర్ టీమ్.