నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యువ దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీలో సీనియర్ నటి వినాయశాంతి హీరో కళ్యాణ్ రామ్ తల్లి పాత్రలో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ నుండి మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థల పై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన మాస్ సాంగ్ నాయల్ది బాగానే రెస్పాన్స్ అందుకుంది. సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 18న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్నట్లు నేడు కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
ఇక ఈ మూవీలో తన తల్లి పాత్రలో నటించిన వైజయంతి గారి పాత్ర ఒకప్పటి ఆమె నటించిన కర్తవ్యంలో పాత్రని గుర్తు చేస్తుందని, అంత అద్భుతంగా నటించారని అంటోంది టీమ్. తమ సినిమా తప్పకుండా ఆడియన్స్ కి నచ్చడంతో పాటు తప్పకుండా ఇది 20 ఏళ్ళ పాటు అందరికీ గుర్తుండిపోతుందని తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తెలిపారు.