Home సమీక్షలు ‘జాక్’ మూవీ రివ్యూ : మిస్ ఫైర్ 

‘జాక్’ మూవీ రివ్యూ : మిస్ ఫైర్ 

jack movie review

మూవీ పేరు: జాక్

రేటింగ్: 2 / 5

తారాగణం: సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్, నరేష్, తదితరులు

దర్శకుడు: బొమ్మరిల్లు భాస్కర్

నిర్మాత: B.V.S.N ప్రసాద్

విడుదల తేదీ: 10 ఏప్రిల్ 2025

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ ఇటీవల వచ్చిన డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో నటుడిగా ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన పేరు సొంతం చేసుకున్నాడు. ఇక ఆ మూవీలో సిద్దు నటనకు అందరి నుండి మంచి ప్రసంశలు కురిసాయి. ఇక తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన మూవీ జాక్. స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీని శ్రీవెంకట్రెశ్వర సినీ చిత్ర సంస్థ గ్రాండ్ గా నిర్మించగా యువ అందాల కథానాయిక వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ నేడు గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈమూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం. 

కథ

ఎప్పటి నుండో రా ఏజెన్సీలో చేరి మన దేశాన్నీ దుష్ట శక్తుల నుండి కాపాడాలనేది జాక్ అనే యువకుడి ఆశ. అయితే అతడు అసలు రా లో ఎందుకు చేరాలనుకున్నాడు, మొత్తానికి చేరాడా, చేరితే అనంతరం అతడి పయనం ఎలా సాగింది, చివరికి అతడు ఎటువంటి ఛాలెంజెస్ ని ఎదుర్కొన్నాడు అనేది మొత్తం కూడా జాక్ మూవీలో చూడాల్సిందే. 

నటీనటుల పెర్ఫార్మన్స్

ఇక ఈ మూవీలో మరొక్కసారి తన ఆకట్టుకునే నటనతో సిద్దు అందరినీ అలరించారు. జాక్ లో తన కామెడీ టైమింగ్ తో పాటు పలు ఇతర సీన్స్ కూడా బాగానే పండాయి. ఇక హీరోయిన్ గా వైష్ణవి చైతన్య తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకునే అందం, అభినయంతో మెప్పించింది. ఇక ఇతర పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, నరేష్ వంటి వారు కూడా తమ తమ పాత్రల్లో ఆకట్టుకునే నటన కనబరిచారు. 

విశ్లేషణ

ఇప్పటివరకు ఎక్కువగా ఫామిలీ ఎమోషనల్ స్టోరీస్ అలానే లవ్ ఎమోషనల్ స్టోరీస్ ని తన శైలిలో తెరకెక్కించిన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, జాక్ మూవీ ద్వారా స్పై యాక్షన్ జానర్ ఎంచుకున్నారు. అయితే అక్కడే ఆయన తడబడ్డారు, పాత కథనే తీసుకున్న భాస్కర్ దానికి కొంత కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ని జత చేసారు. అయితే అవి అక్కడక్కడా మాత్రమే పండాయి తప్ప చాలా వరకు సినిమా పరంగా లోపాలు కనిపిస్తాయి. ముఖ్యంగా రా ఏజెంట్ మిషన్ టెర్రరిస్ట్ లకి ఎంతో సాదా సీదాగా అనిపించడం, నేపాల్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకోకపోవడంతో కీలకమైన సన్నివేశాల నిరాసక్తతతో మూవీ ఏమాత్రం అలరించదు. 

ప్లస్ పాయింట్స్ :

  • కొన్ని హాస్య భాగాలు
  • క్లైమాక్స్ వైపు సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

  • వెర్రి / చిరాకు పుట్టించే కథనం
  • అమెచ్యూరిస్ట్ గా సాగె హీరో పాత్ర
  • తీవ్రమైన సమస్యలను తెలివితక్కువగా నిర్వహించడం

తీర్పు

మొత్తంగా నేడు మంచి అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకి వచ్చిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ జాక్ మూవీ కేవలం అక్కడక్క కొన్ని నవ్వులు మాత్రమే పరిమితం అవుతుంది. సిద్దు జొన్నలగడ్డ నటన బాగున్నప్పటికీ కథ కథనాల్లో పూర్తి లోపంతో ఈ మూవీ మూవీ అందరినీ డిజప్పాయింట్ చేస్తుంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version