సినిమా పేరు: హిట్ 3
రేటింగ్: 3 / 5
నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, రావు రమేష్, తదితరులు
దర్శకుడు: శైలేష్ కొలను
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
విడుదల తేదీ: 1 మే 2025
నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిలర్ మూవీ హిట్ 3. ఇటీవల హిట్ ఫ్రాంచైజ్ లో రిలీజ్ అయిన రెండు సినిమాలు విజయవంతం అవడంతో ఆడియన్స్ ఈ మూవీ పై కూడా మంచి అంచనాలు ఏర్పరుచుకున్నారు. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం.
కథ :
ఏమాత్రం జాలి లేని ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారి అర్జున్ సర్కార్ (నాని) పలువురు క్రిమినల్స్ ని ఏ మాత్రం వదిలిపెట్టకుండా వారిని చిత్రహింసలకు గురిచేస్తూ నుండి నిజాలు రాబడుతూ ఉంటాడు. ఆ విధంగా డార్క్ వెబ్ వాడి సమాజానికి ఇబ్బందిగా మారిన ఒక గ్యాంగ్ ని అతడు ఏవిధంగా తన పద్దతిలో పట్టుకుని నిజాలు రాబట్టాడు అనేది మూవీ యొక్క ప్రధాన కథ.
నటీనటుల పెర్ఫార్మన్స్ లు :
ముఖ్యంగా ఈ మూవీలో నాచురల్ స్టార్ నాని పెర్ఫార్మన్స్ పీక్స్ అని చెప్పాలి. మొదటి నుండి టీమ్ చెప్తున్నా మాదిరిగా ఈ మూవీలోని కొన్ని సీన్స్ లో వయోలెన్స్ ఎక్కువే ఉంది. ఇక నాని అయితే ఆ సీన్స్, డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు.
తన పాత్ర యొక్క పరిధి మేరకు ఆకట్టుకునే అందం, తో పాటు యాక్టింగ్ తో హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది. అయితే విలన్ గా చేసిన ప్రతీక్ బబ్బర్ పెర్ఫార్మన్స్ అంతగా అలరించదు. ఇక ఇతర ముఖ్య పాత్రలు చేసిన సూర్య శ్రీనివాస్, రావు రమేష్, సముద్రఖని, ఆదిల్ పాల, కోమలి ప్రసాద్ తదితరులు బాగానే పెర్ఫార్మ్ చేసారు.
విశ్లేషణ :
ముఖ్యంగా ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్ కథలని తీసుకుని స్క్రిప్ట్ సిద్ధం చేయాలి అంటే, దర్శకుడు ఆడియన్స్ యొక్క పల్స్ ని గట్టిగా పట్టుకోవాలి. అంటే సినిమా ఆద్యంతం వారిని ఆకట్టుకునే విధంగా అలరించే స్క్రీన్ ప్లే రాసుకుని ముందుకి నడిపించగలగాలి.
అయితే గతంలో తీసిన హిట్ రెండు సినిమాల్లో ఎక్కువగా ఇన్వెస్టిగేషన్స్ మీద ఫోకస్ చేసిన దర్శకుడు శైలేష్ ఈ మూవీలో హీరో క్యారెక్టర్ థీమ్ మీద ఎక్కువ ఫోకస్ చేసాడు. అతడి ఐడియా అలానే హీరో యాక్టింగ్ బాగుంది కానీ నెరేషన్ లో కొంత లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా విలన్ పాత్ర చాలా వీక్ గా ఉంది. హీరోకి సమానంగా అతడి పాత్ర ఏమాత్రం లేదు.
లవ్ సీన్స్ ఆకట్టుకోవు, అలానే ట్విస్ట్ లు కూడా జస్ట్ ఓకే అంతే. ఫస్ట్ హాఫ్ లో కొంత బోరింగ్ అంశాలు ఉంటాయి. అయితే సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ తో బాగానే ఆకట్టుకుంటుంది. అయితే మొత్తంగా సినిమాలో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ పోర్షన్స్ తో పాటు పాటు స్టార్స్ క్యామియోలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
అర్జున్ సర్కార్ గా నాని
ఇంటర్వెల్ వైపు సన్నివేశాలు
సెకండ్ హాఫ్
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ ఇన్వెస్టిగేటివ్ పార్ట్స్
సాలిడ్ విలన్ లేకపోవడం
అనవసరమైన ప్రేమ సన్నివేశాలు
తీర్పు
మొత్తంగా హిట్ 3 మూవీ అక్కడక్కడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఆకట్టుకునే క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పవచ్చు. హీరో నాని పవర్ఫుల్ యాక్షన్, సెకండ్ హాఫ్ లో కొన్ని హై ఇచ్చే అంశాలు బాగున్నాయి. అయితే విలన్ క్యారెక్టర్ తో పాటలు లవ్ సీన్స్, సాంగ్స్ ఆకట్టుకోవు. స్క్రీన్ ప్లే కూడా పర్వాలేదు అంతే.