Home సినిమా వార్తలు అమీర్ ఖాన్, రాజమౌళి సినిమాలపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడి క్లారిటీ 

అమీర్ ఖాన్, రాజమౌళి సినిమాలపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడి క్లారిటీ 

dadasaheb falke

లెజెండరీ దాదాసాహెబ్ ఫాల్కే యొక్క బయోపిక్ కి సంబంధించి కొద్దిరోజలుగా పలు వార్తలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సంగతి తెల్సిందే.

ఆయన యొక్క బయోపిక్ ని గ్రాండ్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కలిసి నిర్మించనున్నారు అనే వార్తలు కూడా రాగా మరోవైపు టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కూడా దానిని నిర్మించనున్నట్లు కూడా కథనాలు వచ్చాయి.

ఫైనల్ గా వీటికి సంబంధించి దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ పుసల్కర్ మీడియాకి క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ గత మూడేళ్ళుగా రాజ్ కుమార్ హిరానీ, అమీర్ ఖాన్ బృందం వారు తమ తాతయ్య బయోపిక్ విషయమై ఎప్పటికప్పుడు పలు చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారని, వారికి మా మద్దతు ఉంటుంది, వారు ఆయన బయోపిక్ తీసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు.

ఇక రాజమౌళి నిర్మించనున్న దాదాసాబ్ ఫాల్కే మూవీ విషయమై తమకు ఎటువంటి సమాచారం లేదని, అటువంటి లెజెండరీ పర్సన్ పై బయోపిక్ నిర్మించేటప్పుడు వారి కుటుంబంసభ్యులని సంప్రదించాలనే నియమాన్ని ఉల్లగించడం సరికాదని అన్నారు.

మొత్తంగా పుసల్కర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీని పై జక్కన్న అండ్ టీమ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Exit mobile version