ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కూలీ. ఈ మూవీలో శృతిహాసన్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర తదితరులు కీలకపాత్రలు చేస్తుండగా రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
సన్ పిక్చర్స్ సంస్థపై కళానిధి మారన్ గ్రాండ్ లెవెల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కూలీ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ తో పాటు ఫస్ట్ సాంగ్ అందర్నీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇందులో రజిని పాత్రతో పాటు మాస్ యాక్షన్ సీన్స్ హైలైట్ అంటున్నారు.
అయితే విషయం ఏమిటంటే కూలీ మూవీ యొక్క ఆడియో లాంచ్ ని జూలై 27న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో గ్రాండ్ లెవెల్ లో నిర్వహించేందుకు టీమ్ అయితే సన్నాహాలు చేస్తోంది. ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ కి చిత్రంలోని తారాగణంతో పాటు పలువురు గెస్టులు కూడా ప్రత్యేకంగా హాజరుకానున్నారట. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన కూలీ మూవీ ఆగస్టు 14న రిలీజ్ అనంతరం ఎంత మేర విజయవంతం అవుతుందో చూడాలి