Home సినిమా వార్తలు ‘థగ్ లైఫ్’ : అందరి అంచనాలు అందుకునేనా ?

‘థగ్ లైఫ్’ : అందరి అంచనాలు అందుకునేనా ?

thug life

కమల్ హాసన్, శింబు ల కలయికలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా థగ్ లైఫ్. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 5న గ్రాండ్ గా భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకు రానుంది.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క థియేటర్ ట్రైలర్ 24 గంటల్లో 30 మిలియన్ వ్యూస్ అందుకొని విశేషమైన రెస్పాన్స్ సంపాదించింది.

అయితే విషయం ఏమిటంటే ఇటీవల ఈ సినిమా యొక్క సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి వారి నుంచి యు / సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా మొత్తంగా 2 గంటల 45 నిమిషాలు అనగా 165 నిమిషాల పాటు సాగనుంది. అయితే మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనుంది.

ఆకట్టుకునే కథనాలతో దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అంటోంది టీమ్. మే 24న సినిమా యొక్క అధికారిక ఆడియో లాంచ్ ఈవెంట్ జరగనుంది.

ఎప్పటినుండో మణిరత్నం నుండి ఆడియన్స్ ఆశిస్తున్నా అన్ని యాక్షన్ అంశాలు ఇందులో ఉంటాయని, కమల్ తో పాటు శింబు యాక్టింగ్ మూవీకి ప్రధాన హైలైట్ అని టాక్. అలానే త్రిష కూడా మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర చేస్తున్నట్లు చెప్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version