టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గేమ్ చేంజర్ సినిమా ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. అయితే అది బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం అంచనాలు అందుకోలేక డిజాస్టర్ గా నిలిచింది. దాని అనంతరం ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనాతో ఆయన చేస్తున్న సినిమా పెద్ది.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆస్కార్ విజేత ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పెద్ది మూవీని వెంకట సతీష్ కిలారు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో కలిసి తన వ్రిద్ది సినిమాస్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా యొక్క గ్లింప్స్ ఇప్పటికే రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది.
విషయం ఏమిటంటే తాజాగా లండన్ లోని తన వ్యాక్స్ స్టాట్యూని రివిల్ చేసిన సందర్భంగా అక్కడ స్థానిక ఫ్యాన్స్ తో సమావేశమయ్యారు రామ్ చరణ్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగస్థలం మించేలా పెద్ది ఉంటుందని అన్నారు. తప్పకుండా మూవీ అందరి అందుకుంటుందని నటుడిగా తనని దర్శకుడుగా బుచ్చిబాబు సనని ఈ సినిమా మరింత తారా స్థాయికి తీసుకు వెళుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు రామ్ చరణ్. పెద్ది సినిమా వచ్చే ఏడాది మార్చి చివర్లో ఆడియన్స్ ముందుకు రానుంది.