Home సమీక్షలు భైరవం మూవీ రివ్యూ : డీసెంట్ గా సాగె మాస్ యాక్షన్ డ్రామా 

భైరవం మూవీ రివ్యూ : డీసెంట్ గా సాగె మాస్ యాక్షన్ డ్రామా 

bhairavam

సినిమా పేరు: భైరవం

రేటింగ్: 2.5 / 5

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్, అదితి శంకర్, తదితరులు

దర్శకుడు: విజయ్ కనకమేడల

నిర్మాత: కె.కె. రాధా మోహన్

విడుదల తేదీ: 30 మే 2025 

ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న గరుడన్ మూవీ యొక్క రీమేక్ గా తాజాగా తెరకెక్కిన మూవీ భైరవం. ఈ మూవీ ద్వారా తొలిసారిగా మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించారు.

విజయ్ కనకమేడల తీసిన ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ గ్రాండ్ గా నిర్మించారు. ఇటీవల సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం. 

కథ : 

వరద, గజపతి, శ్రీను అనే ముగ్గురు స్నేహితుల నడుమ సాగుతుంది. ఒక రాజకీయ నాయకుడు ఆలయ భూమిలో రూ. 1000 కోట్లను దోచుకోవటాన్ని వీరు ఎదుర్కొంటారు, తద్వారా వారు ఆ ద్రోహానికి వ్యతిరేకంగా పోరాడి ఏ విధంగా పాల్గొని ఎదుర్కొన్నారు అనేది టూకీగా ఈ మూవీ కథ. 

నటీనటుల పెర్ఫార్మన్స్ : 

ముందుగా ఈ మూవీలో చెప్పుకోవాల్సింది కీలక నటులైన మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ గురించి. ముగ్గురు కూడా తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు అని చెప్పాలి. ఒకింత కీలకమైన పాత్ర చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ అయితే పలు యాక్షన్ ఎమోషనల్ సీన్స్ లో మరింతగా ఆకట్టుకున్నాడు.

ఫస్ట్ హాఫ్ లో నార్మల్ గా ఉండే అతడి పాత్ర సెకండ్ హాఫ్ లో ఎంతో బలంగా మారుతుంది. హీరోయిన్స్ గా నటించిన అదితి శంకర్, దివ్య పిళ్ళై అందరూ కూడా తమ పాత్రల యొక్క పరిధి మేరకు ఆకట్టుకున్నారు. కీలక పాత్ర చేసిని జయసుధ కూడా అలరించారు. అజయ్, సంపత్ రాజ్, సందీప్ రాజ్ పాత్రలు కూడా బాగున్నాయి. 

విశ్లేషణ : 

తమిళ మూవీ గరుడన్ కి రీమేక్ గా రూపొందిన భైరవం మూవీని పాత మూస పద్దతిలోనే తెరకెక్కించారు దర్శకుడు విజయ్ కనకమేడల. ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో పాటు ఒకింత లెంగ్తీ గా అనిపించినప్పటికీ ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగుంది. సెకండ్ హాఫ్ పెద్ద ఆసక్తికరంగా సాగనప్పటికీ ఆ తరువాత వచ్చే మామిడి తోట ఎపిసోడ్ లోని ట్విస్ట్ లు సినిమా పై మంచి ఆసక్తిని ఏర్పరుస్తాయి.

అనంతరం వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. అయితే క్లైమాక్స్ పండడానికి దైవత్వం అనే అంశాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర ద్వారా చూపించారు దర్శకుడు విజయ్. మొత్తంగా తక్కువ సమయంలో సాగినప్పటికీ ఆకట్టుకుంటుంది . 

ప్లస్ పాయింట్స్ : 

  • ముగ్గురు నటుల యాక్టింగ్
  • సెకండ్ హాఫ్
  • యాక్షన్ సీన్స్, ఫైట్స్

మైనస్ పాయింట్స్ :

  • ప్రారంభంలో మూసగా సాగె సీన్స్
  • కామెడీ / ఫిల్లర్ సన్నివేశాలు
  • కొన్ని కీలకమైన సన్నివేశాలు ఆకట్టుకోకపోవడం

తీర్పు : 

మొత్తంగా తొలిసారిగా మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కలిసి నటించిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ భైరవం డీసెంట్ గా సాగె యాక్షన్ డ్రామాగా చెప్పుకోవచ్చు. ఫస్ హాఫ్ సాదాసీదాగా సాగిన ఈ సినిమా సెకండ్ హాఫ్ కొంత ప్రారంభం అనంతరం బాగానే ఆసక్తి ఏర్పరుస్తుంది. ప్రధాన నటీనటులు పెర్ఫార్మన్స్ తో పాటు ఫైట్స్, యాక్షన్ సీన్స్ దీనికి బలంగా చెప్పుకోవచ్చు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version