Home సినిమా వార్తలు Bhagyasri Borse to Act with Suriya సూర్య సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే

Bhagyasri Borse to Act with Suriya సూర్య సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే

suriya

ప్రస్తుతం కోలీవుడ్ నటుడు సూర్య వరుస సినిమాలతో బిజీ బిజీగా కొనసాగుతున్నారు. ఇటీవల శివ దర్శకత్వంలో ఆయన నటించిన కండువా మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. 

ఇక తాజాగా కార్తీక్ సుబ్బరాజు తో ఆయన చేస్తున్న రెట్రో సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతుంది. దీని అనంతరం ఇప్పటికే ఆర్జే బాలాజీ తో ఒక సినిమా అనౌన్స్ చేశారు. మరోవైపు వెట్రిమారన్ తో వాడి వాసల్ మూవీ కోసం కూడా సిద్ధమవుతున్నారు సూర్య. 

అయితే వీటితో పాటు డైరెక్ట్ తెలుగు సినిమా కూడా చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ గ్రాండ్ లెవెల్ లో నిర్మించనున్న ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ అవుతుంది. 

ఈ సినిమాకి ప్రముఖ యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. అలానే ఇందులో హీరోయిన్ గా ఇటీవల మిస్టర్ బచ్చన్ మూవీలో మెరిసిన యువ అందాల నటి భాగ్యశ్రీ బోర్సే సూర్య సరసన నటించనుంది. కాగా త్వరలో ఈ క్రేజీ కాంబినేషన్ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version