Home సినిమా వార్తలు Daaku Maharaaj OTT Streaming Details ‘డాకు మహారాజ్’ ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్

Daaku Maharaaj OTT Streaming Details ‘డాకు మహారాజ్’ ఓటిటి స్ట్రీమింగ్ డీటెయిల్స్

daaku maharaaj

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం అఖండ 2 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ మూవీని 14 రీల్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక ఇటీవల బాలకృష్ణ హీరోగా యువ దర్శకుడు బాబి తెరకెక్కించిన యాక్షన్ మాస్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ డాకూ మహారాజ్. 

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్, బాబి డియోల్, సచిన్ ఖేడేకర్, చాందిని చౌదరి కీలకపాత్రల్లో కనిపించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాకు మహారాజ్ ఓటీటీకి సంబంధించిన డీటెయిల్స్ ని తాజాగా అనౌన్స్ చేశారు. 

ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 21 నుంచి డాకు మహారాజ్ మూవీ ప్రసారం కానుంది. ముఖ్యంగా ఈ మూవీలో బాలకృష్ణ పవర్ఫుల్ యాక్టింగ్ తో పాటు ఎస్ థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలానే విజువల్స్ కి సూపర్ గా రెస్పాన్స్ లభించింది. 

బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు అన్నివర్గాల ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్న డాకు మహారాజ్ ఓటీటి లో ఆడియన్స్ ని ఎంత మేర అలరిస్తుందో తెలియాలంటే మరొక ఐదు రోజులు వెయిట్ చేయాల్సిందే

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version