Home సినిమా వార్తలు Anirudh about Devara Movie Result ‘దేవర’ ఫలితం వెల్లడించిన అనిరుద్ 

Anirudh about Devara Movie Result ‘దేవర’ ఫలితం వెల్లడించిన అనిరుద్ 

anirudh jrntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర పార్ట్ 1 పై రోజురోజుకు అందరిలో భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. తొలిసారిగా ఎన్టీఆర్ కి జోడీగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించగా సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు. 

శ్రీకాంత్, గెటప్ శ్రీను, ప్రకాష్ రాజ్, తాళ్లూరి రామేశ్వరి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక నేడు జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ భద్రత కారణాల రీత్యా రద్దయింది. అయితే విషయం ఏమిటంటే, కొద్దిసేపటి క్రితం ఈ మూవీ సంగీత దర్శకుడు పెట్టిన ట్విట్టర్ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 

ముఖ్యంగా తన తాజా పోస్ట్ లో దేవర ట్యాగ్ తో క్లాప్స్, బ్లాస్ట్ ఎమోజీస్ పోస్ట్ చేసారు అనిరుద్. దానితో దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ కు సంబంధించి అనిరుద్ ఈ ట్వీట్ వేసినట్లు తెలుస్తోంది. గతంలో కూడా జైలర్, లియో రిలీజ్ ల టైంలో కూడా అనిరుద్ ఈ విధంగానే ఎమోజీస్ పోస్ట్ చేయడం జరిగింది. కాగా అనిరుద్ పోస్ట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version