Home సినిమా వార్తలు ​JrNtr Response on Devara Event Cancellation ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిలేషన్ పై ఎన్టీఆర్...

​JrNtr Response on Devara Event Cancellation ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిలేషన్ పై ఎన్టీఆర్ రెస్పాన్స్ 

jr ntr

యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి అన్ని వర్గాల ఆడియన్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో దేవర పార్ట్ 1 మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. 

అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మించారు. ఇక నేడు హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో గ్రాండ్ గా జరగవలసిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ భద్రత కారణాల రీత్యా రద్దు చేయబడింది. కాగా ఈవెంట్ అర్ధాంతరంగా క్యాన్సిల్ అవడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఈ ఈవెంట్ క్యాన్సిల్ పై ఒక వీడియో బైట్ పోస్ట్ చేసారు. 

నిజానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడం ఫ్యాన్స్ కంటే తనకే ఎక్కువ బాధగా ఉందన్నారు. భద్రతా కారణాల రీత్యా ఇది క్యాన్సిల్ అయిందని, దయచేసి ఈవెంట్ ప్లానింగ్ చేసిన వారిని ఏమి అనొద్దని కోరారు ఎన్టీఆర్. అయితే సెప్టెంబర్ 27న థియేటర్స్ లో దేవర ద్వారా ఫ్యాన్స్ ని కలుసుకుని మంచి బ్లాక్ బస్టర్ వారికి అందిస్తాననే నమ్మకం వ్యక్తం చేసారు ఎన్టీఆర్. కాగా ఆయన వీడియో బైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version