Home సినిమా వార్తలు Simbu for OG was Fix పవన్ ‘ఓజి’ కోసం శింబు ఫిక్స్ 

Simbu for OG was Fix పవన్ ‘ఓజి’ కోసం శింబు ఫిక్స్ 

og movie


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీలో ఓజాస్ గంభీర గా పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇంకా ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై దానయ్య దీనిని గ్రాండ్ లెవెల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇటీవల చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఓజి మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అక్టోబర్ లో ప్రారంభించేందుకు టీమ్ ఏర్పాట్లు చేస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియ రెడ్డి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఓజి ఫస్ట్ గ్లింప్స్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

విషయం ఏమిటంటే, ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ నటుడు శింబు ఒక సాంగ్​ పాడనున్నారని ఇటీవల వార్తలు వైరల్ అయ్యాయి. కాగా ఆయన ఈ మూవీలో సాంగ్ పడుతున్నట్లు తాజాగా థమన్ పోస్ట్ చేసిన ట్వీట్ ద్వారా వెల్లడైంది. ఆ ట్వీట్ తో పాటు పోస్ట్ చేసిన పిక్ లో ఓజి మ్యూజిక్ సిట్టింగ్స్ లో భాగంగా థమన్, శింబు, సుజీత్ లని చూడవచ్చు. ఇక అన్ని కార్యక్రమాలు ముగించి ఓజి మూవీని 2025 మార్చి 28న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version