Home సమీక్షలు ‘తమ్ముడు’ మూవీ రివ్యూ : టార్గెట్ మిస్ అయింది

‘తమ్ముడు’ మూవీ రివ్యూ : టార్గెట్ మిస్ అయింది

thammudu

సినిమా పేరు: తమ్ముడు

రేటింగ్: 2 / 5

తారాగణం: నితిన్, స్వసిక విజయ్, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, లయ

దర్శకుడు: వేణు శ్రీరామ్

నిర్మాతలు: రాజు – శిరీష్

విడుదల తేదీ: 27 జూన్ 2025

యువ నటుడు నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ తమ్ముడు. ఈ మూవీ ద్వారా నటి లయ చాలా ఏళ్ళ విరామం అనంతరం మళ్ళి టాలీవుడ్ కి నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన తమ్ముడు మూవీ ట్రైలర్ తో బాగానే ఆసక్తిని రేకెత్తించింది. మరి నేడు మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ ఎంతమేర ఆడియన్స్ ని ఆకట్టుకుంది అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. 

కథ :

ఇది అక్కడ, తమ్ముళ్ల మధ్య సాగే ఎమోషనల్ జర్నీ. ముందుగా జై (నితిన్), తన అక్క లయ కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు, అయితే ఆ ప్రయాణంలో అతడు ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది, మధ్యలో చావు వరకు అతడు వెళ్లాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి. మొత్తంగా ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో చివరికి జై ఏవిధంగా అక్కయ్య లయ ని చేరుకున్నాడు అనేది మొత్తం తెరపై చూడాల్సిందే. 

నటీనటులు పెర్ఫార్మన్స్

ఇక ఎప్పటి మాదిరిగానే హీరో నితిన్ జై గా తనపాత్ర లో ఎంతో ఒదిగిపోయి నటించారు. ముఖ్యంగా కీలక యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో అతడి యాక్టింగ్ మరింతగా ఆకట్టుకుంటుంది. ముఖ్య పాత్ర చేసిన లయ అయితే ఎంతో అలరించారు.

ఇందులో చిన్న పాత్రే అయినప్పటికీ, మొదటి నుండి ఆమె నటనతో పోలిస్తే ఈ పాత్ర మరింతగా ఆమెని నటన పరంగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. ఇక ఇతర పాత్రలు చేసిన వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వశిక వంటి వారు తమ తమ పాత్రల యొక్క పరిధి మేరకు ఎంతో ఆకట్టుకునేలా పెర్ఫార్మ్ చేసారు. బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్ దేవ్ విలన్ గా తన పెర్ఫార్మన్స్ తో అలరించారు. 

విశ్లేషణ

ముందుగా ఈ సినిమా యొక్క ప్రారంభ సీన్స్ ని విలన్ కి సంబందించిన ఎంగేజింగ్ సీన్స్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. హీరో ఎంట్రీ అనంతరం అక్క యొక్క వెతుకులాట ప్రారంభం అవుతుంది. ఇంటర్వెల్ వరకు హృద్యమైన ఎమోషనల్, యాక్షన్ నోట్ లో మూవీ సాగుతుంది.

మొత్తంగా ఐడియా బాగున్నప్పటికీ సాగే కథనం అంతగా ఆకట్టుకోదు. తన అక్కతో కలిసి హీరో ఎన్కౌంటర్ సీన్స్ మూస పద్దతిలో సాగడంతో పాటు ఏమాత్రం ఆకట్టుకోవు. రేడియో గా పని చేసే రత్న అనే పాత్ర చేసిన సప్తమి గౌడ నటన బాగున్నా పాత్ర నమ్మశక్యంగా గా అనిపించదు.

అయితే ఇంటర్వెల్ కె ఆడియన్స్ ఒకింత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే సెకండ్ హాఫ్ బాగుంటుందని భావించినప్పటికీ మొత్తంగా ఒక్క రాత్రిలో సాగే సెకండ్ హాఫ్ సీన్స్ బాగున్నా అంత థ్రిల్ అయితే అందించవు. కొన్ని పాత్రలు డేంజర్ లో ఉన్నప్పటికీ ఆడియన్సు లో ఆసక్తి అనిపించదు. రిపీట్ అయ్యే యాక్షన్ సీన్స్ తో క్లైమాక్స్ కూడా ఆకట్టుకోదు. 

ప్లస్ పాయింట్స్ :

  • ప్రారంభ సన్నివేశాలు
  • కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు
  • అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 

మైనస్ పాయింట్స్ :

  • ఆసక్తికరంగా లేని కథనం
  • పాత మూస సన్నివేశాలు
  • ఎటువంటి హై ఎమోషన్స్ లేని సీన్స్
  • పునరావృతమయ్యే యాక్షన్ ఎపిసోడ్‌లు

తీర్పు

మొత్తంగా నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ తీసిన యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ తమ్ముడు మూవీ తన సక్సెస్ టార్గెట్ ని అందుకోలేకపోయింది. అక్కడక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నప్పటికీ మొత్తంగా కథనం అయితే ఆకట్టుకోదు, ఆడియన్స్ కి పెద్దగా ఆసక్తిని అందించదు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version